రామాయణం క్విజ్ - 8

Image Source: Instagram

కుబేరుడు పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. కుబేరుడు మరియు రావణుడు విశ్రవసువుకు వేర్వేరు భార్యల వలన జన్మిస్తారు, కనుక వీరిద్దరూ సోదరులు.

కైకసి సుమాలి, కేతుమతి ల కుమార్తె. ఈమె సోదరులు మారీచుడు, సుబాహుడు. కైకసి విశ్రవసుని భార్య మరియు రావణ, కుంభకర్ణులూ, విభీషణ, శూర్పణఖలకు తల్లి.

వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుణ్ణి రావణుని వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అనే రాక్షసుని చంపాడు.

మండోదరి రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.

రామాయణం క్విజ్ ఆడండి