రావణుడి కొడుకు మేఘనాధుడికి స్వర్గ లోకంలోని ఇంద్రాది దేవతలను ఓడించటం ద్వారా ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. త్రిమూర్తి అస్త్రాలైన బ్రహ్మాస్త్రం, వైష్ణవస్త్రం మరియు పాశుపతాస్త్రం కలిగిన ఏకైక యోధుడు ఇంద్రజిత్తు.
సుమిత్ర కుమారులైన లక్ష్మణుడు, శత్రుఘ్నడు కవలలు. రాముడు విష్ణువు ఏడవ అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడి అంశ. భరతుడు సుదర్శన చక్రం అంశ కాగా శత్రుఘ్నుడు శంఖం అంశ.
రావణుడు కపట సన్యాసి వేషంలో వచ్చి సీతను బలవంతంగా తీసుకొని వెళ్ళి లంకానగరంలోని అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు.
అహల్య భర్త గౌతమ మహర్షి ఆమెను దేవేంద్రుడితో ఉండటం చూసి రాయిగా మారమని శపిస్తాడు. త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాద స్పర్శతో ఆమెకు శాపవిమోచనం అవుతుందని చెప్తాడు.