శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు తదుపరి అవతారంలో శ్రీకృష్ణుని అన్నయ్య బలరాముడిగా జన్మించాడు. అయితే రాముడు తన తదుపరి అవతారంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు.
నాలుగు యుగాలలో త్రేతా యుగం రెండవది. ఈ యుగంలో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు.
తను తలపెట్టిన యాగాలకు కొంత మంది రాక్షసుల వలన ఆటంకం కలుగుతుందని, రాముడి లాంటి మహావీరుడు యాగరక్షకుడిగా వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాగం పూర్తి చేయవచ్చని విశ్వామిత్రుడు భావిస్తాడు.
శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. ఈ వంశానికి మూలం సూర్యుడని ఆ పేరు. ఇదే వంశం నందు జన్మించి, రాజ్యమేలిన రాజోత్తముల పేర్లతోనూ పిలుస్తుంటారు. ఉదాహరణకు ఇక్ష్వాకు వంశం, రఘు వంశం.