అభిమన్యుడు అర్జునునికి, బలరామకృష్ణుల సహోదరి అయిన సుభద్రకు జన్మించిన పుత్రుడు. అభిమన్యుడు పద్మవ్యూహములో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందుతాడు.
పాండవులకు కూడా సోదరియైన దుశ్శల, తన భర్త సైన్ధవుడు ద్రౌపదిపట్ల అసభ్యంగా ప్రవర్తించినా పాండవులు అతన్ని క్షమిస్తారు. కానీ సైన్ధవుడు అభిమన్యుడి మరణానికి కారకుడవుతాడు.
పరీక్షిత్తు పాండవుల తరువాత భారతదేశాన్ని పరిపాలిస్తాడు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు కృష్ణుడు కాపాడుతాడు.
సహదేవుడు పాండవులలో ఐదవవాడు. అశ్వనీదేవతల అంశ. తమను వంచించిన శకునిని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొంటాడు.