తిరుమల తిరుపతి దేవస్థానం విశేషాలు

Image Source: Instagram

కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రమే "తిరుమల"

Image Source: Instagram

కొండలశ్రేణిలోగల ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి. అందువల్ల ఈ ఆలయాన్ని "ఏడు కొండల ఆలయం" అని కూడా పిలుస్తారు.

Image Source: TTD Photo

స్వామివారి ఇక్కడ కొలువై ఉండటానికి పూర్వమే ఇక్కడ "ఆదివారాహస్వామి" ఉన్నారు. అందువలన దీనిని "ఆదివరహా క్షేత్రం" అని పిలుస్తారు.

Image Source: Google

ఈ కొండకి "వేంకటాచలము" అని పేరు. అంటే పాపములను నశింపజేయు కొండ అని అర్థం.

Image Source: TTD Photo

స్వామివారికి ఆపద మొక్కులవాడని పేరు. అందువలన ఇక్కడ మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

Image Source: TTD Photo

ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు .. ఆ సమయంలో స్వామివారికి జరిగే అలంకరణలు ... వాహనసేవలు .. చూడటానికి రెండు కళ్లూ చాలవు.

Image Source: TTD Photo

ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతున్న తిరుమలను దర్శించడమంటే, సాక్షాత్తు వైకుంఠాన్ని దర్శించడమే.

Image Source: TTD Photo

సాధారణ రోజుల్లో వేంకటేశ్వరుడిని 50,000 నుండి 100,000 మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రత్యేక రోజుల్లో ఈ సంఖ్య 500,000 వరకు పెరుగుతుంది.

Image Source: TTD Photo

హనుమాన్ చాలీసా